పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల

13 Sep, 2023 21:23 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల అయ్యింది.  కేంద్రం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్యసభ, లోక్‌సభలు వేర్వేరుగా బులిటెన్లు విడుదల చేశాయి. 

ఇందులో భాగంగా..  ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నారు. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: 450 మంది పోలీసులకు ప్రధాని విందు

మరిన్ని వార్తలు