పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్‌

15 Sep, 2021 09:44 IST|Sakshi

జైపూర్‌: పర్యాటకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక.. గతంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించినట్లు తెలిస్తే అలాంటి వారి పై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయాలని రాజస్తాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజస్తాన్ టూరిజం ట్రేడ్ (ఫెసిలిటేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టంలోకి కొత్త సెక్షన్‌ చేర్చే సవరణ బిల్లును రాజస్తాన్‌ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ పర్యాటక నిధుల సాయంతో పర్యాటక రోడ్‌ మ్యాప్‌ని సిద్ధం చేయమంటూ... అధికారులను ఆదేశించారు.
(చదవండి: మ్యాగీ మిల్క్‌షేక్‌.. ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’)

ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రాజస్తాన్‌ పర్యటనకు వస్తుంటారు. ఇది పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రముఖ రాష్ట్రం. రాజస్తాన్‌ ప్రభుత్వానికి పర్యాటకరంగం కీలకమైన ఆధాయ మార్గం. అయితే ఇక్కడ పర్యటకుల ఇబ్బందులకు గురి చేసేలా  మోసగించడం, అమానుషంగా ప్రవర్తించడం వంటి సమస్యలను తరుచుగా ఎదుర్కొటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా రాజస్తాన్‌ పర్యాటక మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతస్రా మాట్లాడుతూ... ‘‘పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నిరోధించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నాం’’ అని అన్నారు.
(చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు.. కానీ ఇప్పుడు)

మరిన్ని వార్తలు