తుఫాన్‌ వస్తుంటే బయటకొచ్చావ్‌ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా!

27 May, 2021 14:30 IST|Sakshi

భువనేశ్వర్‌: కరోనా కోరలు చాస్తుండటంతో కట్టడి చర్యలను పకడ్భందీగా అమలు చేస్తున్నారు. మహమ్మారి కొమ్ములు విరిచేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి. కర్ణ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినతరం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. సడలింపు సమయం అనుమతి దాటిన తరువాత ఎవరూ రోడ్డుమీదకు రాకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం చిన్నచిన్న కారణాలను సాకులుగా చూపుతూ పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. స్వీట్స్‌, కుక్కలు,  అంటూ ఏవేవో వింత కారణాలు చెబుతూ అనవసరంగా బయట తిరుగుతున్నారు. 

అయితే ప్రస్తుతం కరోనాతోపాటు కొన్ని రాష్ట్రాలో యాస్‌ తుపాన్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. యాస్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ఒకటి.  తుఫాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు, లకొరిగాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బుధవారం  భీకరగాలులు, భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో బయటకొచ్చి తిరుగుతున్న వ్యక్తి  ఓ మీడియా రిపోర్టర్‌ కంటపడ్డాడు. దీంతో రిపోర్టర్‌ ఆ వ్యక్తిని ఇంత గాలులు వీస్తున్నాయ్‌, తుఫాన్‌ వస్తుంది. ఎందుకు బయటకొచ్చావ్‌ అని ప్రశ్నించాడు. 

దీనికి బదులుగా నువ్వు బయటకొచ్చావ్‌... నేను కూడా బయటకొచ్చా అని ఆ వ్యక్తి తిక్క సమాధనం ఇచ్చాడు. అప్పుడు రిపోర్టర్‌.. నేను వార్తలను కవర్‌ చేయడానికి వచ్చానని చెప్పాడు. ఇది విన్న ఆ వ్యక్తి..అవును మేము బయటకు రాకుంటే మరి మీరు ఎవరిని చూపిస్తారు. మీకు కనిపించడమే కోసమే వచ్చానని కొంటె సమాధనం ఇచ్చాడు. ఇక ఈ వీడియోను స్థానిక మీడియా సోషల్‌ మీడియాలో పంచుకుంది. సదరు వ్యక్తి చెప్పిన సరదా సమాధానం ప్రస్తుతం నెటిజన్లతో నవ్వూలు పూయిస్తోంది. కావాలంటే ఈ వీడియోను మీరూ చూడండి.

మరిన్ని వార్తలు