Republic Day: ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్స్‌ ప్రకటించిన కేంద్రం.. ఏపీకి విశిష్ట సేవా అవార్డులు

25 Jan, 2023 11:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి  రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్  విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్  విశిష్ట సేవా అవార్డులు, 13 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

కాగా, జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్‌కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది.
చదవండి: రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్‌ 


 

మరిన్ని వార్తలు :

Advertisement
మరిన్ని వార్తలు