విషాదంలో అర్నాబ్‌ గోస్వామి

5 Feb, 2021 15:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వార్త సంస్థ రిపబ్లిక్ ఇండియా యాంకర్ వికాస్ శర్మ (35) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం రాత్రి మృతిచెందాడు. రిపబ్లిక్ టీవీ‌లో వికాస్‌ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ‘యే భారత్ కి బాత్ హై’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. అతడి మృతికి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి సంతాపం వ్యక్తం చేశారు. వికాస్‌ మృతితో తన న్యూస్ నెట్‌వర్క్‌కు తీరని లోటు అని అర్నాబ్‌ గోస్వామి తెలిపారు. ఆయన ఎప్పుడూ సమాజం కోసం ఆలోచించే వ్యక్తి అని.. అలాంటి అరుదైన ప్రతిభ ఉన్న యాంకర్ ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని ఆవేదన చెందారు.

కొన్ని రోజుల కిందట కరోనా బారినపడిన వికాస్‌ శర్మకు మూడు రోజుల కిందట తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు వికాస్‌ను నొయిడాలోని కైలాష్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. వికాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వికాస్ శర్మ మృతిపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, జర్నలిస్ట్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు