కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాయామం

31 Oct, 2020 19:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన మంచి మార్గం మరొకటి లేదని నిపుణులు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాయామంలో రెండు రకాలని, ఒకటి ఎరోబిక్‌ అయితే మరొకటి ఎనరోబిక్‌ వ్యాయామాలంటూ కూడా విభజన తీసుకొచ్చారు. ఎరోబిక్‌ అంటే గాలి ఎక్కువగా అందుబాటులో ఉండే మైదానాల్లో నడవడం, పరుగెత్తడం, ఈత కొట్టడం కాగా, ఎనరోబిక్‌ అంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెయిట్‌ లిఫ్టింగ్, జంపింగ్‌ లాంటివి. ఒకానొక దశలో ఈ రెండు కూడా కలసిపోయి జిమ్ముల రూపంలో వెలిశాయి. ఎరోబిక్స్‌లో డాన్యుల లాంటివి కూడా కలిసిపోయాయి. (చదవండి : కరోనా రోగులకు మరో షాక్‌?!)

ఆరోగ్యంతో పాటు శీరర సౌష్టవం సొగసుగా ఉండాలంటే ఎరోబిక్స్‌ ముఖ్యమని, ఎనరోబిక్స్‌ కూడా ముఖ్యమని, రెండూ కూడా అవసరమనే వాదనలు తలెత్తాయి, సద్దుమణిగాయి. ప్రాణాంతక కరోనా విజంభిస్తోన్న నేటి సమయంలో వ్యాయామం ఒక్క దానితో ప్రాణాలను కాపాడు కోలేమని, పౌష్టికాహారంతోపాటు అవసరమైన విటమిన్లు మింగాల్సిందేనంటూ కొంత మంది వైద్యులు చెబుతూ వచ్చారు. విటమిన్ల వల్ల మానవ శరీరాల్లో రోగ నిరోధక శక్తి పెరగుతోందని కూడా చెప్పారు. 

మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ల సమతౌల్యంతో పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదని, ‘రెసిస్టెంట్‌ ఎక్సర్‌సైజ్‌’ అవసరమని డాక్టర్‌ మైఖేల్‌ మోస్లీ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వ్యాయామం చేసే వారికి కరోనా వ్యాక్సిన్లు కూడా బాగా పని చేస్తాయని చెప్పారు. ఈ విషయం కాలిఫోర్నియాలో వాలంటర్లీపై తాజాగా జరిపిన అధ్యయనంలో తేలిందని చెప్పారు. అంటు రోగాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను గత కొంత కాలంగా రెసిస్టెంట్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. (చదవండి : అందుకే లాక్‌డౌన్‌ పొడగిస్తున్నాం)

పుషప్స్, ప్రెసప్స్, స్క్వాట్స్, అబ్డామన్‌ క్రంచెస్, లంగ్స్, ప్లాంక్‌ వ్యాయామాలతో శరీరంలోని ‘టీ–సెల్స్‌’ అభివద్ధి చెంది రోగ నిరోధక శక్తి పెరగతుందని ఆయన చెప్పారు. ఫిజియో థెరపీ కింద వాడే సాగే రిబ్బన్లను తీసుకొని 15 నిమిషాలపాటు చేతులు, భుజాల వ్యాయామం తాను కొత్తగా ప్రయోగించి చూశానని, సాగే రిబ్బన్లను లాగడం వల్ల శరీర కణాల్లో చురుకుదనం బాగా పెరగతోందని ఆయన వివరించారు. ఆయన తన అధ్యయన వివరాలను పూర్తిగా ‘స్పోర్ట్స్‌ అండ్‌ హెల్త్‌’ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. 

గుండె బాగుండాలంటే పషప్స్‌ ఒక్కటే సరిపోవని, శరీరాన్ని బాలెన్స్‌ చేస్తూ చేసే స్క్వాట్స్‌ ఎంతో అవసరమని డాక్టర్‌ మైఖేల్‌ తెలిపారు. వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుందని డాక్టర్‌ చెప్పారు. మొదట కరోనా ఎదుర్కోవాలంటీ యోగా చేయాలని, ఊపిరితిత్తుల బలం కోసం బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాలంటూ ఇంతవరకు ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే.(చదవండి :కరోనా దెబ్బ: తిరోగమనమే!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు