సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: రేవంత్‌

13 Jun, 2022 15:24 IST|Sakshi

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం ఎన్స్‌ఫోర్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు నిరసనలకు దిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ‍్యలు చేశారు. కాగా, హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌ ఎదుట రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గాంధీ కుటుంబంపై బీజేపీ అక్రమ కేసులు పెడుతోంది. సోనియా గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదు. స్వాతంత్య్ర పోరాటంలో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికది కీలక పాత్ర. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను బ్రిటిషర్లు నిషేధించారు. 

కానీ, దేశ సమగ్రత కోసం నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను మళ్లీ నడపాలని యజమాన్యం నిర‍్ణయించారు. అయితే, పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్‌ పార్టీ రూ. 90 కోట్లు ఇచ్చింది. 2015లో ముగిసిన విచారణను నరేంద్ర మోదీ సర్కార్‌ మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ కుట్రలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాము’’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో టెన్షన్‌.. టెన్షన్‌.. 144 సెక్ష‌న్‌ విధింపు

మరిన్ని వార్తలు