శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది..

13 Feb, 2021 08:09 IST|Sakshi

ఫొటో చూడగానే.. అదేం విచిత్రమైన ఉంగరం రా బాబూ అనిపించిందా? నిజమే ఉంగరం ఆకారం కొంచెం విచిత్రంగా ఉంది కానీ ప్రయోజనం? అబ్బో ఈ రింగు చాలా హాట్‌ గురూ అనేంత బాగుంటుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో శాస్త్రవేత్తలు దీన్ని సృష్టించారు. థర్మో ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ (టీఈజీ)లు కొత్తేం కాకున్నా.. దీనికి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

మన పరిసరాల్లోని ఉష్ణోగ్రతకు, శరీరంలోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది ఈ పరికరం. పాలీమైన్‌ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ ఉంగరం పైభాగంలో చిన్న సైజు టీఈజీలు ఉంటాయి. చర్మం ఎంత మేరకు ఈ పాలీమైన్‌ పదార్థానికి అతుక్కుని ఉందో అంత విద్యుత్తు తయారు చేయగలదు. కచ్చితమైన లెక్కలు కావాలంటే ప్రతి చదరపు సెంటీమీటర్‌కు ఒక వోల్టు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. వాచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లకు ఈ విద్యుత్తు సరిపోతుంది. చేతికి తొడుక్కునే కడియం లాంటిది తయారు చేస్తే విద్యుదుత్పత్తి 5 వోల్టుల వరకు పెంచొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు