రియా సీబీఐకి తప్పక సహకరిస్తుంది

19 Aug, 2020 14:16 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పువెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి తరపు లాయర్‌ సతీష్‌ మనేషిండే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దేశ అత్యున్నత న్యాయస్థానం కేసుకు సంబంధించిన నిజానిజాలను, ముంబై పోలీసులు ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రియా చక్రవర్తి ముందే అభిప్రాయపడింది. ( సీబీఐకి సుశాంత్ సింగ్‌‌ మృతి కేసు )

అంతేకాకుండా రెండు రాష్ట్రాల(బీహార్‌,మహారాష్ట్ర) రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో న్యాయం జరగాలన్న ఉద్ధేశ్యంతోనే కేసు సీబీఐకి అప్పగించబడింది. రియా సీబీఐ విచారణకు తప్పకుండా సహకరిస్తుంది. గతంలో ఆమె ముంబై పోలీస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు కూడా సహకరించింది. కేసు ఏ సంస్థకు బదిలీ అయినా నిజం ఎప్పటికి నిజమేనని ఆమె భావిస్తోంది’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు