అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే

19 Feb, 2021 15:26 IST|Sakshi

బీహార్: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా బీహార్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంతో అసెంబ్లీ మొదటి రోజున ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన మహువా ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పాట్నాలోని అసెంబ్లీకి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంపై తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశారు. "నేను హాజీపూర్ నుంచి ఉదయం 7గంటలకు సైకిల్ మీద బయలుదేరాను. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో ఏది కొనే పరిస్థితి లేదు, అలాగే బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటి విషయంపై ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం" అని ముఖేష్ మీడియాకు తెలిపారు.

చదవండి: భారీగా పడిపోయిన బంగారం ధరలు

మరిన్ని వార్తలు