అమిత్‌ షా బర్త్‌డే రోజు ట్రెండ్‌ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్‌ ట్వీట్

24 Oct, 2021 19:38 IST|Sakshi

RJD MLA Surendra Prasad Yadav Wishes On Amit Shah Birthday: అంకుశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటనతో తనకట్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామిరెడ్డి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు. 2011లోనే ఆయన మరణించగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవాల్సిందే.

వివరాల్లోకెళ్తే.. అక్టోబర్‌ 22న కేంద్రహోం మంత్రి అమిత్‌ షా 57వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారు. ఆ క్రమంలోనే బీహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ కూడా 'మన హోం మంత్రి అమిత్‌షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఓ ట్వీట్‌ చేశారు. అయితే అందులో అమిత్‌ షా ఫొటోకు బదులు రామిరెడ్డి ఫొటో వాడారు. దీంతో ప్రస్తుతం ఆర్జేడీ ఎమ్మెల్యే ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఫొటోను గుర్తించిన నెటిజన్లు దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

అయితే ఇది పొరపాటున జరిగినట్లు అందరూ భావిస్తున్న తరుణంలో ఆర్జేడీ ఎమ్మెల్యే మరో ట్వీట్‌ చేశారు. 'క్షమించండి.. ఉపఎన్నికల ప్రచారంలో ఉండి ఈ విషయాన్ని సరిగా చూసుకోలేదు.. మన అద్భుతమైన మోటా బాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తమిళ విలన్ సంతాన భారతి ఫొటో పెట్టి మరోసారి అమిత్ షాకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇదంతా సురేంద్ర ప్రసాద్‌ యాదవ్ కావాలనే చేసినట్లు నెటిజన్లకు అర్థమైపోయింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు