వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!

3 May, 2021 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: మీకు దగ్గర ఏదైనా వాహనం ఉందా? లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన 1989 చట్టంలోని  కొన్ని నిబంధనలలో మార్పులు చేసింది. ఈ కొత్త నిబందనల ప్రకారం.. వాహన యజమాని వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తన వాహనానికి నామినీ పేరును కూడా జత చేయవచ్చు. ప్రస్తుతం ఎలాగైతే బ్యాంక్ ఖాతా, భీమా వంటి ఖాతాలకు నామినీని పెట్టుకున్నామో అలాగా అన్నమాట. 

వాహన యజమాని మరణించినప్పుడు ఆ వాహనాన్ని తన పేరు మీద మార్చుకోవడానికి ఈ మార్పుల వల్ల సులభతరం కానుంది. నామినీ పేరును వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తర్వాత అయిన ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా జత చేయవచ్చు. ఇప్పటి వరకు నామినీని జాతచేయడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండే విదంగా కొత్త నిబందనలు తీసుకువచ్చింది. నామినీ పేరును జత చేయాలంటే అతని గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి.

వాహన యజమాని మరణించిన తర్వాత ఆ వాహనాన్ని తన పేరుమీదకు మార్చాలంటే 30 రోజుల్లోపు యజమాని మరణాన్ని రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. అలాగే, వాహన యజమాని మరణించిన 3 నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం-31 ను సమర్పించాలి. పెళ్లి విడాకులు, ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీలో పేరు మార్పు కోసం యజమాని అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)తో మార్చవచ్చు.

ప్రస్తుతం ఒక వాహనం రిజిస్టర్డ్ యజమాని మరణించిన సందర్భంలో వాహనాన్ని నామినీకి బదిలీ చేయడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాలి. రాష్ట్రం రాష్ట్రానికీ ఈ విధానం మారుతూ ఉంటుంది. యజమాని మరణించిన సందర్భంలో వాహన బదిలీకి చట్టపరమైన వారసుడిగా గుర్తింపు రుజువు చూపించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పౌరుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నవంబర్ 27న, 2020 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో నామినీ పేరు వాహనం యజమాని జత చేయడానికి సెంట్రల్ మోటార్ వాహనాలు 1989 చట్టంలో మార్పులు చేయాలని మొదట ప్రతిపాదించింది. తర్వాత అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అలాగే, సాధారణ ప్రజల నుండి సలహాలు కోరింది. అన్నీ సూచనలను పరిశీలించిన తరువాత, మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.

చదవండి:

కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా?

మరిన్ని వార్తలు