వాద్రాకు పాజిటివ్‌.. క్వారంటైన్‌లో కుటుంబం

2 Apr, 2021 16:19 IST|Sakshi

అన్ని పర్యటనలు రద్దు చేసుకున్న ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తామిద్దరు ఢిల్లీలోని వారి నివాసంలో సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌లో ఉన్నామని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. అంతకు ముందు తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికి తనకు పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు వాద్రా. ఆ తర్వాత ప్రియాంక తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 

‘‘నా భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నేను కూడా టెస్ట్‌లు చేయించుకున్నాను. నాకు నెగిటివ్‌ అని వచ్చింది. ప్రస్తుతం మేం హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్టా నేను అస్సాం, తమిళనాడులో పర్యటించాల్సి ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను. కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రియాంక వీడియోలో తెలిపారు. 

‘‘పిల్లలు కూడా గత కొద్ది కాలంగా మాతోనే ఉంటున్నారు.. అదృష్టం కొద్ది ప్రియాంకకు, పిల్లలకు నెగిటివ్‌గా తేలింది’’ అని రాబర్ట్‌ వాద్రా ప్రకటించారు. ఇక ప్రియాంక మంగళవారం కేరళలో రోడ్‌ షోలో పాల్గొన్నారు. అంతకు ముందు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అ‍క్కడ ప్రచారం చేశారు.

చదవండి: క్వారంటైన్‌ కలిపింది ఆ ఇద్దరినీ...

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు