Robot Firefighter: ఢిల్లీ గోడౌన్‌లో మంటలు ఆర్పుతున్న 'రోబో': వీడియో వైరల్‌

26 Jun, 2022 12:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుఝామున 2.18 గంటకు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఐతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడంలో ఎరుపు రంగు రోబో కీలక పాత్ర పోషించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం గత నెలలో రెండు రోబోలను ఆస్ట్రేలియా కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఆ రోబోలో ఒకటి ఈ రెడ్‌ రోబో. ఈ అగ్నిమాపక రోబోలను ఉపయోగించడం వల్ల త్వరిగతగతిన మంటలు అదుపులోకి తీసుకురాగలమని, సాధ్యమైనంత మేర తక్కువ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.

ఇవి సుమారు 100 మీటర్ల దూరం నుంచి కూడా మంటలను ఆర్పగలదు. ఇరుకైన మార్గంలో సంభవించిన ప్రమాదాల్లో సైతం ఈ రోబోలు చాలచక్కగా నావిగేట్‌ చేసి మంటలను ఆర్పేస్తాయని అంటున్నారు. ఇవి నిమిషానికి దాదాపు 2 వేల లీటర్లు చొప్పున నీటిని విడుదల చేయగలవు. ఇవి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగిసి పడుతున్న అగ్నికీలల స్థాయిని బట్టి  సామర్థ్యం మేర నీటిని విడుదల చేసేలా ప్రత్యేక విభాగం కూడా ఉంది. వీటికి సెన్సార్‌, కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. ఇవి నాలుగు కిలోమీటర్ల వేగంతో కదలగలవు.

(చదవండి: షాకింగ్‌ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్‌)

>
మరిన్ని వార్తలు