ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..

28 Sep, 2021 09:10 IST|Sakshi

లక్నో: ఎవరైన ఏడిస్తే కళ్లలోంచి నీళ్లు వస్తాయి. కానీ ఈ పాపకు కన్నీళ్లతోపాటు రాళ్లు కూడా వస్తాయి. అయితే రెండు కళ్ల నుంచి కాదు.. కేవలం ఎడమ కంటిలో నుంచి రాళ్లు వస్తుంటాయి. వినడానికి కొంత వింతగా అనిపిస్తున్నా.. ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ బాలిక కంట్లో నుంచి రాళ్లు వస్తున్నాయి. గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక ఈ వింత సమస్యతో బాధపడుతోంది. కూతురు సమస్యకు పరిష్కారం కోసం తల్లిదండ్రులు చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏ డాక్టర్ కూడా ఇది ఏ సమస్యో చెప్పలేకపోయారు.
చదవండి: కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ

ఆమెకు ఈ సమస్య ఎప్పటి నుంచో లేదు. గత జూలై 27 నుంచి ఆమె ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్లు బయటకొస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా బాలిక ఎడమ కంటి నుంచి ఏడుస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్లు వస్తున్నాయని, రోజూ దాదాపు 10-15 రాళ్లు బయటకొచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలోనే కాదు ఆ కన్ను నలిపినా, ఒత్తిడికి లోనైనా రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక భాదపడుతోంది. అలా రాళ్లు కళ్లలో నుంచి వస్తుండటంతో ఆమె ఎడమ కన్ను ఎర్రగా, నొప్పిగా ఉంటుందని బాలిక వాపోతుంది.
చదవండి: కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు