కీలక పదవికి జైట్లీ కుమారుడు ఏకగ్రీవం

17 Oct, 2020 18:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహాన్‌ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (డీడీసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్‌ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్‌.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్‌ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్‌ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్‌ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్‌ ఎన్నికయ్యారు. 

ఢిల్లీ క్రికెట్‌ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్‌ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ ‌షా కోట్ల మైదానానికి అరుణ్‌ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది.
 

మరిన్ని వార్తలు