Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్‌ 

27 Aug, 2021 13:56 IST|Sakshi
సిద్ధంగా ఉన్న మొబైల్‌ వాహనం

సాక్షి బళ్లారి (కర్ణాటక): రూపాయికే రెండు రొట్టెలు, దాల్, లేదా చిత్రాన్నం వివిధ రకాల ఫ్రైడ్‌ రైస్‌లతో కూడిన భోజనాన్ని అందించేందుకు జైన్‌ యువక మండలి ముందుకు వచ్చింది. తక్కువ ధరకే భోజనాన్ని శుక్రవారం నుంచి పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

నగరంలోని జైన్‌ దేవాలయం వద్ద ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జైన్‌ యువక మండలి పదాధికారులు భరత్‌జైన్, తదితరులు మాట్లాడుతూ ఓపీడీ ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, ప్రైవేట్, ప్రభుత్వ బస్టాండ్ల వద్దకు ఈ మొబైల్‌ వాహనం చేరుకొని పేదలకు రూ.1కే భోజనం అందిస్తుందని తెలిపారు.  

చదవండి: విమానంలో సిగరెట్‌ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు