Viral Video: కదులుతున్న రైలు నుంచి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. క్షణం ఆలస్యమయ్యుంటే..

19 Oct, 2021 17:20 IST|Sakshi

కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం చేయకూడదన్న విషయం తెలిసిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కదులుతున్న రైలు ఎక్కబోతూ లేదా దిగబోతూ కలిగిన ప్రమాదాలకు గురైన వీడియోలు చూశాం. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ముంబై సమీపంలోని వందన అనే 21 ఏళ్ల గర్భిణీ తన భర్త, పాపతో కలిసి కల్యాణ్ రైల్వేస్టేషనుకు చేరుకుంది. వారు గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. అయితే అనుకోకుండా వేరే రైలు ఎక్కారు. వారు ఎక్కిన రైలు తప్పు అని తెలిసి దిగే సమయానికి రైలు కదలటం ప్రారంభించింది.
చదవండి: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి

దీంతో అంతే ఏం చేయాలో తెలియక అయోమయంలో దిగడానికి ప్రయత్నించారు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో ప్లాట్ ఫాం మీద పడబోయింది. సరిగ్గా అదే సమయంలో స్టేషన్‌లో విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ మహిళను పట్టుకొని బయటకు లాగేసరికి ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
చదవండి: సైలెంట్‌ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్‌

ఈ వీడియోను ముంబైలోని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మహిళను కాపాడిన ఎస్ఆర్ ఖండేకర్ రియల్ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే ఒకవేళ పోలీస్‌ అధికారి లేకుంటే ఏమయ్యేది అని, రైలు ఎక్కే.. దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు