వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు

24 May, 2021 16:29 IST|Sakshi

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 3591
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, వైర్‌మెన్‌ తదితరాలు. 

అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి. 

వయసు: 04.06.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
 
ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి. 

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

వెబ్‌సైట్‌: https://rrc-wr.com/

మరిన్ని నోటిఫికేషన్లు:
ఏపీలో గ్రామ/వార్డ్‌  సచివాలయ వలంటీర్‌ ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీలో ఉద్యోగాలు

బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు