ఒకే వ్యక్తి ఖాతాలో రూ.103 కోట్ల పిఎఫ్ జమ

5 Feb, 2021 19:13 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా ఒక వ్యక్తి పీఎఫ్ ఖాతాలో ఎంత నగదు జమ అవుతుంది? 25ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరి.. 60 ఏళ్ల వయస్సులో రిటైర్ మెంట్ అయ్యేసరికి అతని పీఎఫ్ ఖాతాలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి జమ అవుతుంది. అది కూడా మధ్యలో ఎప్పుడు తీయకపోతే. రిటైర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో చక్కగా జీవిత చరమాంకం వరకు చాలా హాయిగా గడపవచ్చని భావిస్తారు. తాజాగా ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఇపిఎఫ్) ఖాతాల గురించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం బయటకి వచ్చింది. (చదవండి: గగన్‌యాన్ కోసం చికెన్ బిర్యానీ)

మన దేశంలోనే ఓ వ్యక్తి పీఎఫ్ ఖాతాలో ఏకంగా రూ.103 కోట్లు జమ అయ్యాయి. 2018-19లో అత్యంత పీఎఫ్ అందుకునే 1.23 లక్షల పీఎఫ్ అకౌంట్లలో రూ.62,500 కోట్లు జమ అయ్యాయి. దేశంలో 4.5 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో ఈ 0.3 శాతం మంది అత్యధిక ఈపీఎఫ్ కార్పస్ ఫండ్ పొందుతున్నారు. ఇపిఎఫ్ అత్యధికంగా సంపాదించే 20 మంది ఖాతాల్లో మొత్తం రూ.825 కోట్లు జమ అయ్యాయి. అదే సమయంలో ఎక్కువగా సంపాదించే టాప్ 100 మంది ఖాతాల్లోనే రూ.2,000 కోట్లకు పైగా నగదు జమ చేయబడింది. 

20 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తూ రూ.15వేలకు పైగా జీతం అందుకునే వారికీ కచ్చితంగా కంపెనీ గ్రాస్ శాలరీపై 12శాతం వారి వేతనంలో పీఎఫ్ కింద జమ చేస్తుంది. అలాగే అంతే మొత్తంలో కంపెనీ కూడా నగదును వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏడాదికి 7.5లక్షల కంటే ఎక్కువ మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేయరాదు అనే నిబంధన గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రైవేట్ కంపెనీ విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఉద్యోగి ఖాతాలో ఎంతైనా కంపెనీ జమ చేయవచ్చు. అందుకే చాలా మంది నిపుణులు అత్యవసర విషయంలో తప్ప ఎప్పుడు కూడా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు డ్రా చేయవద్దు అని కోరుతారు.

మరిన్ని వార్తలు