ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కరోనా, ఆసుపత్రికి తరలింపు

10 Apr, 2021 10:34 IST|Sakshi

కరోనా బారిన  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

మార్చి 7న  వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్న భగవత్‌

సాక్షి,ముంబై:  దేశంలో కరోనా వైరస్ రెండో దశలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ  ప్రకంపనలు పుట్టిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు పుంజు కుంటున్నాయి.  కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా అనేకమంది వైద్యులు, ఇతర సెలబ్రిటీలు కోవిడ్‌-19 వైరస్‌ సోకుతోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. అయితే తేలికపాటి లక్షణాలతో నాగ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ భగవత్‌ ఆరోగ్యంపై సమాచారాన్ని పోస్ట్‌ చేసింది.  మార్చి 7న ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. 

కాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల నమోదు భారీగా ఉంది. మరోవైపు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం తాజాగా1,45,384 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మరో 794 మంది మరణించారు. 

>
మరిన్ని వార్తలు