మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్‌ భగవత్‌

23 Sep, 2022 06:30 IST|Sakshi
మసీదులోకి వెళ్తున్న మోహన్‌ భగవత్‌

న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు.

ఆల్‌ ఇండియా ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇలియాస్‌ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్‌ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్‌ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు