కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్‌ యువతి

24 Jan, 2021 15:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: దేవుడంటే ఆమెకు అమిత భక్తి. నిత్యం శ్రీకృష్ణుని నామస్మరణలో మునిగి తేలే ఆమె తన ఆరాధ్య దైవాన్ని ఓ సారి దర్శించాలనుకుంది. అందుకోసం ఆత్మహత్య చేసుకుని ఆ దేవుడి చెంతకు చేరేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రష్యన్‌ యువతి తత్యానా హెలోవ్‌స్కయ  గతేడాది ఫిబ్రవరి నుంచి యూపీలోని వృందావన్‌ ధామ్‌ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ ​క్రమంలో తను ఉంటున్న భవనంలో ఆరో అంతస్థు నుంచి దూకి అర్ధాంతరంగా తనువు చాలించింది. (చదవండి: చేపల కూర విషయమై గొడవ, హత్య)

అయితే ఆమెకు కృష్ణుడిని కలవాలన్న కోరిక ఉండేదని, అందుకోసమే ఇలా ప్రాణత్యాగం చేసి ఉండవచ్చని అదే భవనంలో నివసిస్తున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న యువతి రష్యాలోని రోస్తవ్‌ నగరానికి చెందినదని, ప్రయాణికురాలి వీసా కింద ఇక్కడకు వచ్చిందని పోలీసులు నిర్ధారణ చేశారు. ఆమె మరణ విషయాన్ని రష్యన్‌ ఎంబసీకి చేరవేశారు. (చదవండి: వెండి సింహాల చోరుడి అరెస్ట్)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు