యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదు!: జై శంకర్‌

21 Feb, 2023 19:45 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరికి సంబంధించిన యూట్యూబ్‌, సోషల్‌ మీడియా లింక్‌లను తొలగించాలని బీబీసిని కేంద్ర ఆదేశించింది కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకే బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా జరిగాయి. కానీ ఇది ఐటీ దాడులు కాదని పన్నుల లావాదేవీల్లోని అవతవకలపై సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది కూడా. ఐతే వీటిపై ప్రతిపక్షాలు అధికార పార్టీ ఐటీ దాడులతో నిజాలను నొక్కేస్తుందంటూ దుమ్మెత్తిపోశాయి. ఈ విషయంపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం విదేశీ మీడియా ప్రచురించిన కథనాన్ని ఖండించినందున ఇది రాజకీయం అంటూ పిలుస్తున్నారు.

అయినా ఇంత అకస్మాత్తుగా అభిప్రాయాలు, డాక్యుమెంటరీలు అంటూ ఎందుకు వచ్చాయి. 2024 జాతీయ ఎన్నికలకు ఒక సంత్సరం ముందు ఈ డాక్యుమెంటరీ బయటకు వచ్చింది. దీన్ని జై శంకర్‌ అందరీ దృష్టిని మరల్చేలా మోదీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంగా అభివర్ణించారు. వాస్తవానికి బీబీసీ ఐటీ నిబంనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి మరీ ఈ డాక్యుమెంటరీని తీసిందన్నారు. 1984లో ఢిల్లీలో చాలా విషయాలు జరిగాయి కదా మరీ వాటి గురించి ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదని ప్రశ్నించారు. ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదని నొక్కి చెప్పారు. భారత్‌లో ఎన్నికల సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి కావలనే బీబీసీ ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అదే లండన్‌, న్యూజిలాండ్‌ ఎన్నికల సమయంలో ఇలా చేస్తుందా? అని నిలదీశారు.

2002 గుజరాత్‌ అల్లర్ల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై వచ్చిన ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని సార్లు ఇలాంటి బురద రాజకీయాలు భారతదేశ సరిహద్దుల నుంచి కాకుండా బయట నుంచి కూడా వస్తున్నాయన్నారు. భారత్‌పై తీవ్రవాద చిత్రాన్ని ముద్ర వేయడం అనేది కేవలం బీజేపీనే లేక ప్రధాని మోదీని ఉద్దేశించో జరగడం లేదని, గత కొంతకాలంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని జైశంకర్‌ అన్నారు. ఈ కథనాల వెనుక ఉద్దేశ్యం విదేశాల్లో భారతదేశ వ్యతిరేక ఎజెండాను తీసుకెళ్లేడమేనని అన్నారు.

"మేము ఒక డాక్యుమెంటరీ లేదా యూరోపియన్‌ నగరంలో చేసిన ప్రసంగం గురించో మాట్లాడటం లేదు. దీని గురించి చర్చిస్తున్నాం. పైగా ఇక్కడి రాజకీయాలను మీడియా ప్రత్యక్షంగా నిర్వహిస్తుంది కూడా. తెర వెనుక చేస్తున్న రాజకీయాలు చేస్తున్నావారికి నిజంగా రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం లేని వాళ్లే చేసే పనులే ఇవి. ఈ కథనం వెనుక ఉన్న వారెవరో రాజకీయాల్లోకి రావాలని సవాలు విసిరారు. పైగా మీడియా, ఎన్జీవో అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ కథనాలతో రాజకీయాల చేయరని మండిపడ్డారు". జైశంకర్‌.

(చదవండి: ఇందిరాగాంధీ నా తం‍డ్రిని ఆ పదవి నుంచి తొలగించారు: జై శంకర్‌)

>
మరిన్ని వార్తలు