సదాశివ రావు బాపు సాహెబ్‌ భోసలే మృతి

16 Apr, 2021 13:59 IST|Sakshi

యశవంతపుర: దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సదాశివ రావు బాపు సాహెబ్‌ భోసలే (101) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బెళగావి తాలూకా కడోళి గ్రామంలో తన స్వగృహం లో గురువారం తుదిశ్వాస విడిచారు. 25 ఎకరాలు పేదలకు దానం చేశారు. భోసలే బెళగావి దక్షిణ, హిరేబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు.

భూదా నోద్యంలో పాల్గొనడమే కాకుండా తనకున్న 25 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతోందనే బాధతో 12 ఏళ్లపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1969లో ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించారు. తన స్వగ్రామంలో గాంధీ స్మారక నివాసాన్ని నిర్మించారు. భోసలే మృతికి గవర్నర్‌ వజూభాయ్‌ నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు