ఏబీసీ నూతన చైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌ 

16 Sep, 2022 07:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌ ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక ‘సకల్‌’ను ప్రచురించే సకల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. 2022–23 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గతంలో మహ్రాత్తా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌(పుణే) అధ్యక్షుడిగా సేవలందించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ప్రతాప్‌ పవార్‌ను భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా శ్రీనివాసన్‌ కె.స్వామి ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు