Suo Moto Case: పీఎంకేర్స్‌ను చేర్చండి

20 May, 2021 08:38 IST|Sakshi

సుప్రీంకోర్టులో అప్లికేషన్‌ దాఖలు 

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై సుమోటోగా విచారిస్తున్న కేసులో పీఎం కేర్స్‌ను ప్రతివాదిగా చేర్చాలంటూ సామాజిక కార్యకర్త సాకేత్‌గోఖలే ఇంటర్‌వెన్షన్‌ కోరుతూ సుప్రీంకోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేశారు. కోవిడ్‌–19కు అవసరమైన సామగ్రి సేకరణ, సేవలు, నిధుల విషయంలో పీఎం కేర్స్‌ ముఖ్య భాగస్వామి అని అప్లికేషన్‌లో పేర్కొన్నారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించి ఏ రకమైన సహాయమైనా చేయడం, మద్దతు ఇవ్వడం, ఔషధ సదుపాయాల కల్పన, ఆర్థిక సహాయం చేయడం ఈ నిధి లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘పీఎంకేర్స్‌ నిధి ప్రభుత్వేతర వాటాదారు. నిత్యావసరాల పంపిణీ, సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు, ప్రాజెక్టులతో సంబంధం ఉంది.

కోవిడ్‌–19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడానికి చేసే వివిధ కేటాయింపులు, ద్రవ్య కేటాయింపులు, ప్రాజెక్టు పురోగతి ఎలా పర్యవేక్షణ చేస్తోందనే అంశాలపై అత్యున్నత న్యాయస్ధానానికి సమాచారం అందజేయడం చాలా ముఖ్యం. గతేడాది మేలో పీఎం కేర్స్‌ ఫండ్‌ ఏర్పాటైంది. కోవిడ్‌ –19 కోసం రూ. 3,000 కోట్లు కేటాయించినట్లు అందులో.. రూ. 2,000 కోట్లు వెంటిలేటర్లకు వినియోగించినట్లు , వలస కార్మికుల సంరక్షణ కోసం రూ. 1,000 కోట్లు, టీకా అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. టీకా అభివృద్ధి కోసం అదనపు నిధులు కేటాయించారా లేదా అనే సమాచారం పబ్లిక్‌డొమైన్‌లో లేదు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే నిరాకరిస్తున్నారు’’ అని అప్లికేషన్‌లో పేర్కొన్నారు. 
చదవండి: Covid Strain: కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై సింగపూర్‌ అభ్యంతరం

మరిన్ని వార్తలు