Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

9 Sep, 2022 10:00 IST|Sakshi

1. CM YS Jagan: 22న సీఎం వైఎస్‌ జగన్‌ కుప్పం పర్యటన  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ  వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్‌ స్థలాలను గురువారం పరిశీలించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. LIVE Updates: ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర
పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. Telangana: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 9న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ
:కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టికి దిగువన తుంగభద్ర, వేదవతి, భీమా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,26,201 క్యూసెక్కులు చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 12,500, హంద్రీ–నీవా ద్వారా 1,125, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. Human Development Index: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. 400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేడు గజగజ వణకడానికి కారణాలేంటి?
చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. Kohli-KL Rahul: రోహిత్‌ లేకుంటే ఫ్రీ హ్యాండ్‌ తీసుకుంటారా!
1020 రోజులు... ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడేళ్లుగా ఎదురు చూసిన క్షణం... సింగిల్‌ తీసినంత సులువుగా సెంచరీలు సాధించిన కోహ్లి 70 నుంచి 71కి చేరేందుకు మైళ్ల కొద్దీ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న భావన... ఆటలో లోపం కనిపించలేదు, పరుగులు చేయడం లేదనే సమస్య రాలేదు... అయితే
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. ద్రవ్యోల్బణ కట్టడి బాధ్యతను ఆర్‌బీఐకే వదిలేయలేం..!
 ద్రవ్యోల్బణం నియంత్రణ బాధ్యతలను కేవలం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య  విధానానికే వదిలివేయలేమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం, కేవలం ద్రవ్య పరమైన అంశాలే కాకుండా ద్రవ్యోల్బణాన్ని పలు అంశాలు నిర్దేశిస్తున్నాయని సూచించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. Regina Cassandra: అది అప్పుడే ముగిసిపోయింది.. ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో..
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్‌ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్‌ మొదల్‌ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్‌
మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్‌ అని చెప్పుకుని ట్యూషన్‌ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు