ఎంఎస్‌పీ కమిటీ భేటీని బహిష్కరించిన రైతు సంఘాలు

17 Aug, 2022 08:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ ఆగస్టు 22న తొలిసారి సమావేశం కానుంది. అయితే, ఈ తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) మంగళవారం ప్రకటించింది. కమిటీని తామిప్పటికే తిరస్కరించామని గుర్తు చేసింది. త్వరలో భావిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఎస్‌కేఎం నేత హనుమాన్‌ మొల్లా తెలిపారు.

మరోవైపు ఎస్‌కేఎం నేతలను కనీస మద్దతు ధర కమిటీ భేటీకి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ ప్రకటన చేయటం ప్రాధాన‍్యం సంతరించుకుంది. 26 మందితో ఎంఎస్‌పీ కమిటీని జూలై 18న కేంద్రం నియమించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్‌ షాక్‌.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా!

మరిన్ని వార్తలు