టీవీ సిరీస్‌లో సానియా మీర్జా

12 Nov, 2020 14:38 IST|Sakshi

ముంబై : ప్రముఖ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా మొట్టమొదటిసారి టీవీ సిరీస్‌లో నటించబోతున్నారు. క్షయ వ్యాధి (టిబి) పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఎమ్‌టివి నిషేద్ అలోన్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సిరీస్‌లో సానియా మీర్జాగానే ఆమె కనిపించనున్నారు. దీనిపై సానియా మీర్జా మాట్లాడుతూ.. ‘టీబీ మన దేశంలో అత్యంత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ మహ్మరి బారినపడ్డ వారిలో సగానిపైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని చుట్టూ ఉన్న అవాస్తవాలను పరిష్కరించడానికి, అవగాహన కల్పించటానికి, ప్రజల్లో మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కాగా, ఐదు ఎపిసోడ్ల ఈ సిరీస్‌ ఎమ్‌టీవీ ఇండియా, ఎమ్‌టీవీ నిషేద్‌ ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా వేదికల్లో విడుదల కానుంది. నవంబర్‌ చివరి వారంలో ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ: సానియా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు