Santosh Bangar: ఉద్ధవ్‌ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు

4 Jul, 2022 17:42 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సీఎం షిండేకు మద్దతుగా.. 164 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.

ఇదిలా ఉండగా.. బలపరీక్షలో శివసేన ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌కు సపోర్టుగా నిలిచారు. మద్దతుగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ట్విటర్‌లో జూన్ 24న పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. కాగా, శివసేనకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం క్రితం సంతోష్‌ బంగర్‌.. తాను ఉద్ధవ​ థాక్రేకు మద్దుతు ఇస్తున్నట్టు చెప్పాడు. 

ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సంతోష్‌ బంగర్‌ ఓ సభలో మాట్లాడుతూ.. ఉద్ధవ్‌కి మద్దతుగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ, ఉద్ధవ్‌ థాక్రేకు షాకిస్తూ.. సోమవారం జరిగిన బల పరీక్షలో సంతోష్‌ బంగర్‌.. సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతు ఇచ్చారు. దీంతో ఉద్ధవ్‌ వర్గం ఒక్కసారిగా ఆశ‍్చర్యానికి గురైంది. అయితే, సంతోష్ బంగర్ ఆదివారం రాత్రే ముంబైలోని ఓ హోటల్‌లో సీఎం షిండేని కలిసినట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్‌!

మరిన్ని వార్తలు