చీరలో మెరిసిపోతూ.. శానిటైజర్‌ అందిస్తోన్న రోబో

27 Jul, 2020 14:54 IST|Sakshi

చెన్నై: కరోనా వచ్చిన నాటి నుంచి పలు దేశాల్లో రోబోల వాడకం పెరిగిపోయింది. కరోనా కట్టడి కోసం సామాజక దూరం తప్పని సరి కావడంతో రోబోల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ బట్టల దుకాణాదారుడు.. కస్టమర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచన చేశాడు. దానిలో భాగంగా షాప్‌లోకి వచ్చే కస్టమర్లకు శానిటైజర్‌ అందించడం.. టెంపరేచర్‌ చెక్‌ చేయడం కోసం ఓ రోబోను ఏర్పాటు చేశాడు. అంతటితో ఊరుకోక ఆ రోబోకు చక్కగా చీర కట్టి అందంగా ముస్తాబు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.(కరోనాపై పోరుకు కొత్త అస్త్రం!)

సుధా రామేన్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ‘తమిళనాడులోని ఓ బట్టల దుకాణం సాంకేతికతను సరైన మార్గంలో వినియోగించుకుంటోంది. చీర కట్టులో మెరిసిపోతున్న ఓ మర మనిషి కస్టమర్ల దగ్గరకు వెళ్లి శానిటైజర్‌ అందిస్తోంది’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 35వేల మంది లైక్‌ చేశారు. ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే.. మోడల్‌ కం హెల్పర్‌.. మీ ఐడియా సూపర్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు.(‘గాడిద సార్‌.. మాస్క్‌ ధరించదు’)

మరిన్ని వార్తలు