హెలికాప్టర్‌లో వచ్చి ‌ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సర్పంచ్

17 Feb, 2021 20:17 IST|Sakshi

మహారాష్ట్ర: ఎన్నికల నామినేషన్ ల మొదలు గెలిచే వరకు ప్రతి ఒక్కరు ప్రజలను ఆకర్షించడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. ఇక గెలిచాక వారి హంగామా ఒక రేంజిలో ఉంటుంది. టపాసులు పేల్చడం, డీజే పాటలకు నృత్యాలు చేయడం వంటివి మనం గమనిస్తుంటాం. అయితే మహారాష్ట్రలో మాత్రం అందరికి విభిన్నంగా గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేపట్టాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ తాలూకాలో ఉన్న అంబి-డుమాలా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ తన ప్రమాణస్వీకారం చేపట్టడానికి ఏకంగా హెలికాప్టర్ లో వచ్చాడు. 

గత నెలలో జరిగిన ఎన్నికలలో పూణేలో ఉంటున్న పారిశ్రామికవేత్త జలీందర్ గగారే(50) అంబి-డుమాలా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతనితో పాటు తన 9 మంది సభ్యుల ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇటు వ్యాపార పనులు చూసుకుంటున్న జలీందర్ గగారే ప్రమాణ స్వీకారం దగ్గర పడటంతో పూణేలో ఉంటున్న తన ఇంటి నుంచి నేరుగా తన స్వగ్రామానికి ఏకంగా హెలికాప్టర్‌లోనే వచ్చి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. హెలికాప్టర్‌ నుంచి దిగాక గ్రామ ప్రజలు పూల మాలలతో స్వాగతం పలికారు. అతనికి స్థానికులు విజయ 'తిలకం' దిద్ది హెలిప్యాడ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి 12 ఎద్దుల బండ్ల మీద ఉరేగింపులో తీసుకువెళ్లారు. వ్యాపారం రీత్యా పూణేలో నివసిస్తున్న తన స్వగ్రామం, సన్నిహితులతో సంబంధాన్ని తెంచుకోలేదు అని పేర్కొన్నాడు. సొంత గ్రామం అభివృద్ధి కోసమే సర్పంచ్‌గా పోటీ చేశానని జలిందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు