పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!

23 Oct, 2020 06:53 IST|Sakshi

న్యాయవాది ధీమా

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ పది రోజుల్లో జైలు నుంచి విడుదల య్యే అవకాశాలున్నట్టు ఆమె న్యాయవాది రాజా చెందూర్‌ పాండియన్‌ ధీమా వ్యక్తం చేశారు. జరిమానా మొత్తం రూ.10 కోట్ల 10 వేలు సిద్ధం చేశామని తెలిపారు. అక్రమాస్తుల కేసులో శిక్ష ముగించుకుని జనవరిలో శశికళ జైలు నుంచి విడుదల అవుతారని ఇప్పటికే సంకేతాలు వెలుడిన విషయం తెలిసిందే. తన న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌కు శశికళ ఆదివారం ఓలేఖ కూడా రాశారు.  (శశికళ వ్యూహం.. పది కోట్ల జరిమానాకు రెడీ) 

ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ న్యాయవాది గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నమ్మ తనకు రాసిన లేఖలోని అంశాల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మకు కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 వేలు జరిమానాను సిద్ధం చేసినట్టు తెలిపారు. కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్ష అనుభవించే వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధిలో ఉంటుందని, చిన్నమ్మ కు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందన్నారు.

ఇప్పటికే చిన్నమ్మ 43 నెలలు జైల్లో ఉన్నారని, మరో పది రోజు ల్లో ఆమె విడుదలయ్యేందుకు అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో కోర్టులకు దసరా సెలవులని, ఈనెల 26న కోర్టులు పునః ప్రారంభం కానున్నా యని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళ లేదా బుధవారం మంచి సమాచారం వెలువడే అవకాశం ఉందని చెప్పారు. చిన్నమ్మ జైలు నుంచి ముందు గానే విడుదల అవుతారని ఇప్పటికే తాను పేర్కొన్నానని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.  (ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన)

మరిన్ని వార్తలు