పాక్‌ ఉగ్రవాది కసబ్‌కి ఉన్న వెసులుబాటు నాకు లేదు: సత్యేంద్ర జైన్‌

22 Nov, 2022 21:20 IST|Sakshi

తిహార్‌ జైలులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్‌ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ మసాజ్‌ వీడియో లీకైన సంగతి తెలిసిందే. పైగా ఆ మసాజ్‌ చేస్తున్న వ్యక్తి రేపిస్ట్‌ అని జైలు అధికారులు చెప్పడంతో మరింత వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు సత్యేంద్ర జైన్‌ జైలు గదిలోని ఫుటేజ్‌ లీక్‌ అవ్వడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి వ్యతిరేకంగా పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్‌ ధుల్‌ ట్రయల్‌ కోర్టులో వాదనలు వినిపించారు.

అందులో భాగంగా జైన్ మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కోర్టు ఆదేశాలు ఉల్లంఘింస్తూ... మీడియాకు సున్నితమైన సమాచారాన్ని లీక్‌ చేస్తున్నారంటూ జైన్‌ తరపు న్యాయవాది వాదించారు. వారి చర్యలతో ప్రతి నిమిషం తమ పరువు పోతుందని అన్నారు. ఈ మేరకు సత్యేందర్‌ జైన్‌ ట్రయల్‌ కోర్టులో మాట్లాడుతూ...కనీసం 26/11 ముంబై దాడుల్లో ఉరిశిక్ష పడిన పాకిస్తాన్‌  ఉగ్రవాదిని ప్రస్తావిస్తూ... అజ్మల్‌ కసబ్‌కు కూడా ఉచిత న్యాయపరమైన విచారణ వచ్చింది. కనీసం నేను అంతకంటే అధ్వాన్నంగా లేను. నేను కోరేది న్యాయమైన ఉచిత విచారణ. దయచేసి నాకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా నివేదికలను పరిశీలించండి అని జైన్‌ కోర్టుని కోరాడు.

అలాగే ఆయన జైలుతో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నట్లు వచ్చిన ఈడీ ఆరోపణలను కూడా ఖండించారు. జైలులో తాను 28 కేజీలు తగ్గాను, సరైన తిండి కూడా లేదన్నారు. కోర్టు తనపై ఒత్తిడి తీసుకువచ్చిన జైలు నిబంధనలను కూడా ఉల్లంఘించలేదని అన్నారు. మరోవైపు జైన్‌ని జైలులో ఉంచేందుకు బీజేపీ ఈడీని దుర్వినియోగం చేస్తుందంటూ ఆప్‌ పదేపదే ఆరోపిస్తోంది. ఐతే ఈడీ తరుపు న్యాయవాది జోహైబ్‌ హుస్సేన్‌ సత్యేంద్ర జైన్‌కి ఫిజియోథెరఫీ తీసుకోమని సలహ ఇవ్వడంతో ఆయన దానిని తీసుకుంటున్నారని వాదించారు.

కేంద్ర ఏజెన్సీ ద్వారా ఒక్కటి కూడా లీక్‌ అవ్వలేదని అన్నారు. అలాగే దోషులకు న్యాయం జరిగేలా చూస్తామని న్యాయవాది అన్నారు. అలాగే జైన్‌ తరుఫు న్యాయవాది కేంద్ర ఏజెన్సీలు తనను ఉరిశిక్ష పడే ఖైదీగా చిత్రీకరిస్తూ లీక్‌ అవుతున్న వీడియోలు, ప్రముఖ ఛానెల్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా సమర్పించారు. ఐతే ఈడీకి నేతృత్వం వహిస్తున్న అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) ఎస్సీ రాజు వ్యక్తిగత కారణాలతో హాజరు కాకపోవడంతో కోర్టు ఈ కేసును వాయిదా వేసింది. 

(చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్..)

మరిన్ని వార్తలు