ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే లింక్ చేయండి

1 Jun, 2021 16:15 IST|Sakshi

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఖాతా ఉందా? మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి లేకపోతే మీ ఖాతా, పాన్ కార్డ్ చెల్లవు. ఎస్‌బీఐ తన ఖాతాదారులను జూన్ 30 లోపు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలని కోరింది. ఈ  మేరకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేని ఎస్‌బీఐ సేవలను పొందాలంటే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని" ట్వీట్ లో పేర్కొంది పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది అని భవిష్యత్ లో లావాదేవీలను నిర్వహించడానికి కష్టం అవుతుంది అని పేర్కొంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2021. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును కరోనా మహమ్మారి దృష్ట్యా జూన్ 30 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే https://www.incometax.gov.in/ పోర్టల్ ద్వారా జూన్ 7 నుంచి లింక్ చేయవచ్చు.

చదవండి: 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

>
మరిన్ని వార్తలు