ఎస్‌బీఐలో 6100 అప్రెంటిస్‌ ఖాళీలు 

7 Jul, 2021 15:36 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన ముంబయిలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం... దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► మొత్తం అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 6100
► తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125.

► అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి: ఒక ఏడాది. 
► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

► వయసు: 31.10.2020 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో 
సడలింపు లభిస్తుంది. 

► స్టయిపెండ్‌: అప్రెంటిస్‌ శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్‌ లభిస్తుంది. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు. 

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

► రాత పరీక్ష ఇలా: ఎస్‌బీఐ అప్రెంటిస్‌ రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌–25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌–25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌–25 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌–25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట(60 నిమిషాలు). ప్రతి విభాగానికి 15 నిమిషాలు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.07.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021
► వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers, https://apprenticeshipindia.org

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు