ఎస్‌బీఐ వినియోగదారులకి హెచ్చరిక

18 Feb, 2021 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గమనిక. మీరు మీ ఎస్‌బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తన కస్టమర్లకు ట్విటర్ ద్వారా హెచ్చరికలు జారీచేసింది. ఒకవేల మీరు కనుక ఎస్‌బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలు పొందలేరని పేర్కొంది. తమ ఖాతాలోకి ప్రభుత్వ సబ్సిడీలు తమ అకౌంట్లలోకి నేరుగా రావాలంటే ఆధార్ లింక్ చేయాలని పేర్కొంది. ఎస్‌బీఐ ఖాతాకు ఆధార్ అనుసంధానం నాలుగు విధాలుగా చేయవచ్చని ఎస్‌బీఐ కస్టమర్లు తెలుసుకోవాలి. వారి ఖాతాను ఆధార్ లింక్ చేయటానికి ఇష్టపడే వారు ఎస్‌బీఐ యాప్, ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం, వారి సమీప ఎస్‌బీఐ బ్యాంక్ శాఖను సందర్శించడం ద్వారా అనుసంధానం చేయవచ్చు. (చదవండి: అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి)

మరిన్ని వార్తలు