ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక

20 May, 2021 21:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవలు 3 రోజల పాటు పనిచేయవని బ్యాంకు తెలిపింది. రేపట్నుంచి వరుసగా 3 రోజులు మే 21, 22, 23 రోజుల్లో మెయింటెనెన్స్‌ కారణంగా ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ వె​ల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 1.15 గంటల వరకు, అలాగే మే 23న 2.40 గంటల నుంచి 6.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ ట్వీట్‌లో తెలిపింది.

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కారణంగా బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తున్నాయి.  మే 31 వరకు ఇది అమలులో ఉండనుంది.

చదవండి: Paytm: ఎల్‌పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు