ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఇంకా మూడు రోజులే గడువు

28 May, 2021 19:39 IST|Sakshi

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్. మీరు కనుక ఎస్‌బీఐ ఖాతాదారులు అయితే వెంటనే మీ కెవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. 2021 మే 31 లోగా వినియోగదారులు అందరూ కేవైసీ వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని కోరుతూ ట్విట్టర్, ఇమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం ఇచ్చింది. కాబట్టి ఎస్‌బీఐ ఖాతాదారులు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్‌డేట్ చేసుకోవాల్సిందే. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కస్టమర్లు పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా తమ కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపవచ్చు అని తెలిపింది. 

ఖాతాదారులు సంబంధిత పత్రాలను బ్యాంకుకు పంపితే సరిపోతుంది. అయితే కస్టమర్లు తమ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్ నుంచే కేవైసీ డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది. ఖాతాదారులు ప్రభుత్వం చేత గుర్తింపబడిన పాస్ పోర్ట్ ఐడీ, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, NREGA కార్డ్, పాన్ కార్డ్ వంటి వాటిలో ఏదైనా ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే కొందరు మోసాగాళ్లు కెవైసీ పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు ఎస్‌బీఐ గుర్తించింది. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరైనా కెవైసీ అప్డేట్ చేయకపోతే 24 ఖాతా బ్లాక్ అనే సందేశం వస్తే ఆ లింకుపై క్లిక్ చేయవద్దు అని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక పోర్టల్ ను సందర్శించాలని కోరింది.

చదవండి: 5జీ ట్రయల్స్‌ కోసం స్పెక్ట్రమ్‌ కేటాయింపు

మరిన్ని వార్తలు