పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్

11 Jun, 2021 19:52 IST|Sakshi

కరోనా చికిత్సకు కవాచ్ పర్సనల్ లోన్

గరిష్ఠ గడువు చెల్లింపు కాలం 60 నెలలు

8.5 శాతం వడ్డీ రేటు

కరోనా మహమ్మారితో ప్రజలు భాదపడుతున్న సమయంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. కరోనా చికిత్స కారణంగా ఆర్థిక ఒత్తిడితో చితికిపోతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 'కవాచ్ పర్సనల్ లోన్' పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేని రుణాన్ని ప్రవేశపెట్టింది. కోవిడ్-19 చికిత్స కోసం తన, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం వినియోగదారులకు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.

రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు సంవత్సరానికి 8.5% వడ్డీ రేటుతో ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ గరిష్ఠ గడువు చెల్లింపు కాలం 60 నెలలు. లోన్ తీసుకున్న మూడు నెలలు ఈఎమ్ఐ కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ కోవిడ్ సహాయక చర్యలకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తున్న కోవిడ్ -19 లోన్ లలో 'కవాచ్ పర్సనల్ లోన్' కూడా ఒకటని ఎస్‌బిఐ పేర్కొంది. "ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచీకత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నాము. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితిలో మా ఖాతాదారుల కుటుంబాలు ఆర్ధికంగా ఊబిలో చిక్కుకోకుండా ఉండటానికి దీనిని ప్రవేశ పెట్టినట్లు" ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేష్‌ ఖారా వెల్లడించారు. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం కూడా ఒక మంచి విషయం.

చదవండి: 

కరోనా రోగులకు సేవలందించనున్న "గ్రేస్‌ రోబో నర్స్"

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు