నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్‌ చేసిన కొలీజియం

9 Feb, 2023 05:49 IST|Sakshi

న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్‌ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ సభ్యులుగా ఉన్నారు.

కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్‌ సబీనాను హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ను, జస్టిస్‌ సందీప్‌ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది.

మరిన్ని వార్తలు