సీబీఐ, ఈడీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు: సుప్రీం

3 Dec, 2020 05:21 IST|Sakshi

న్యూఢిల్లీ: విచారణ జరిపే, అరెస్ట్‌ చేసే అధికారాలున్న సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, ఇతర రికార్డింగ్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లోని ప్రధాన ద్వారం, లోపలికి, బయటకు వెళ్లే మార్గాలు, ఇంటరాగేషన్‌ సెల్స్, లాకప్‌ గదులు, కారిడార్లు, రిసెప్షన్‌ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు