మీడియా ప్రసారాలను నియంత్రించలేం: సుప్రీంకోర్టు

6 May, 2021 13:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఈసీనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి... ఈసీ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈసీపై హత్య కేసు పెట్టాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ఎన్నికల కమిషన్‌యే కారణమని మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది.

అయితే మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. కోర్టులో వాదనలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించలేమని స్పష్టం చేసింది. అదే విధంగా కీలక కేసుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని మద్రాస్‌ హైకోర్టుకు సూచించింది.

చదవండి: రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు