NDA Exam: మహిళల ఆశలను అడ్డుకోలేం.. పరీక్ష నిర్వహించాల్సిందే

22 Sep, 2021 20:43 IST|Sakshi

సుప్రీం కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: మహిళా అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్ష ఈ ఏడాది నిర్వహించలేమని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నవంబర్‌ 14న మహిళా అభ్యుర్థులకు ఎన్‌డీఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ విచారణ చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి పరీక్ష నిర్వహిస్తామనటం సరికాదని, అలా చెప్పడం వారి ఆశలను అడ్డుకోవడం అవుతుందని అన్నారు.

ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఎన్‌డీఏ  పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మహిళా అభ్యర్థుల నమ్మకం, ఆశలను అడ్డుకోలేమని సుప్రీం కోర్డు పేర్కొంది. త్రివిధ దళాల్లో మహిళలను ఎంపిక చేస్తామని రక్షణా శాఖ ఇటీవల అఫిడవిట్‌ విడుదల చేసింది. అయితే మహిళా అభ్యర్థుల త్రివిధ దళాలకు సంబంధించి ఎన్‌డీఏ క్యాడెట్‌ శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించే విషయంపై ప్రవేశపరీక్షను వచ్చే ఏడాది నుంచి నిర్వహిస్తామని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు