ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

9 Sep, 2020 15:50 IST|Sakshi

మరాఠా కోటాపై స్టే విధించిన సుప్రీంకోర్టు

విస్తృత ధర్మాసనానికి బదలాయింపు

సాక్షి, న్యూఢిల్లీ : 2020-21లో ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్లలో మరాఠా కోటాపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరాఠా కోటా చట్టబద్ధతను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. చదవండి : ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

2018లో ఏర్పాటు చేసిన ఈ కోటా కింద ఇప్పటివరకూ ప్రయోజనాలు పొందిన వారిపై తీర్పు ప్రభావం ఉండదని పేర్కొంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్ధల ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్‌లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. కాగా ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్‌ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని గత ఏడాది పేర్కొంది.

>
మరిన్ని వార్తలు