విద్వేష ప్రసంగాలు వద్దు: సుప్రీం హెచ్చరిక 

27 Apr, 2022 03:32 IST|Sakshi

నేడు ఉత్తరాఖండ్‌ రూర్కీలో ధర్మ సంసద్‌  

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో బుధవారం ధర్మ సంసద్‌ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

గత ఏడాది హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష ప్రసంగాలు చేయడంతో ఈసారి అలా జరగకుండా చూడాలంటూ దాఖలైన  పిటిషన్లను సుప్రీం విచారించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఉత్తరాఖండ్‌లో బీజేపీ సర్కార్‌ సుప్రీంకు హామీ ఇచ్చింది.    

మరిన్ని వార్తలు