ఆ స్కూల్‌లో ఒకే ఒక్క స్టూడెంట్‌!

23 Jan, 2023 14:43 IST|Sakshi

ఒక గ్రామం మొత్తానికే గాక అక్కడ ఉన్న పాఠశాల్లో కూడా ఒక ఒక్కే విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అతని కోసమే ఒక ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంకా విచిత్రమేమిటంటే ఉన్నది ఒకే ఒక్క విద్యార్థి అయినా స్కూల్లో రోజువారిగా జరిగే జాతీయ గీతంతో సహా అ‍న్ని జరుగుతాయి. ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లా నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న గణేష్‌పూర్‌ గ్రామంలో ఉన్న జిల్లా పరిషిత్‌ ప్రాథమిక పాఠశాల అంతటకీ ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు.

ఆ ‍గ్రామంలో కేవలం 150 మంది జనాభా. దీంతో ఆ బాలుడు ఒక్కడే విద్యార్థిగా ఉన్నాడు. ఈ మేరకు ఈ పాఠశాల ఉపాధ్యాయుడు కిషోర్‌ మాన్‌కర్‌ మాట్లాడుతూ...ఈ పాఠశాల్లో తానొక్కడినే ఉపాధ్యాయుడునని చెప్పారు. తాను రెండేళ్లుగా ఆ బాలుడికి పాఠాలు చెప్పేందుకు ఈ గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. ఉన్నది ఒక్క విద్యార్థి అయినా ఉదయం 10.30 గంటలు నుంచి జాతీయ గీతం ఆలపించడంతో సహా అన్ని నియమ నిబంధనాలు పాటిస్తానని చెప్పారు. ఆ విద్యార్థికి అన్ని సబ్జెక్టులు బోధించడమే గాక మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 

(చదవండి: మహా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. అంబేద్కర్‌ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌ కలిసొచ్చేనా?)

మరిన్ని వార్తలు