Tamil Nadu: రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం

28 Jan, 2022 06:53 IST|Sakshi

సాక్షి, చెన్నై: కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ గురువారం ప్రకటించారు. అయితే, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి మంజూరు చేయలేదు.  రాష్ట్రంలో కరోనా మరలా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం గత నెల 7వ తేదీ నుంచి పలు ఆంక్షలను అమలులోకి తెచ్చింది.

ఇందులో భాగంగా పాఠశాలల మూత, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాల్లో దర్శనాల నిలిపివేత, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ వంటి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈనేపథ్యంలో కరోనాపై సమీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌  ఈ నిబంధనలను సడలించారు. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.   

చదవండి: (ఎన్నికల బరిలో ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’)  

మరిన్ని వార్తలు