అక్కడ సరి, బేసి విధానంలో పాఠశాలలు 

2 Nov, 2020 15:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గువహటి: కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలలుగా మూత పడిని స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్‌లాక్‌ 5.0 నిబంధనల్లో భాగంగా అసోంలో ఈరోజు నుంచి విద్యా సంస్థలను తెరిచారు. ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు సరి, బేసి విధానంలో పాఠాలు మొదలపెట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే తరగతులు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సరి, బేసి విధానంలో  తరగతులు పెట్టడం వల్ల కొవిడ్‌-19 వ్యాపించకుండా చేయొచ్చన్నారు.  

6, 8, 12 తరగతులు సోమ, బుధ, శుక్ర వారాల్లో నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో 7, 9,11 తరగతులు జరుగుతాయి. తరగతులు జరిగే రోజుల్లో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా గ్రూపులుగా విభజించనున్నారు. కొన్ని గ్రూపులకు ఉదయం మరికొన్ని గ్రూపులకు మధ్యాహ్నం పాఠాలు చెప్పనున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారనేది ఆయా పాఠశాలలు, కాలేజీల యాజమాన్యం నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు. ఉదయం తరగతులు 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. మధ్యాహ్న తరగతులు 12.30 నుంచి సాయంత్రం 3.30 వరకు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు